సాక్షి, న్యూఢిల్లీ: సాగర్‌మాల కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఏడు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్పీ)లను ఏర్పా టు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పనున్నారు. దేశవ్యాప్తంగా సరుకు రవాణా తీరుతెన్నులను అధ్యయనం చేసి పారిశ్రామిక క్లస్టర్లకు అందుబాటులో ఉండేలా ఆయా ప్రాంతాల ను గుర్తించారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఒక ఎంఎంఎల్పీ అందుబాటులోకి వచ్చిందని కేంద్రానికి కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) తెలి పింది. తెలంగాణలోని నాగులపల్లిలో 60 ఎకరాల్లో .. ఇప్పటికే 16 ఎకరాల్లో రూ.120 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలక్ష్యంగా కేంద్రం సాగర్‌మాల రూపొందించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్
Published Tue, Jul 5 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement