సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్‌ పార్క్‌.. హైదరాబాద్‌లో ప్రారంభం | South Indias biggest Urban logistics park Constructed by Safexpress Was Opened in Hyderabad | Sakshi
Sakshi News home page

సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్‌ పార్క్‌.. హైదరాబాద్‌లో ప్రారంభం

Published Tue, Feb 8 2022 11:44 AM | Last Updated on Tue, Feb 8 2022 12:20 PM

South Indias biggest Urban logistics park Constructed by Safexpress Was Opened in Hyderabad - Sakshi

దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద అర్బన్‌ లాజిస్టిక్‌ పార్క్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సేఫెక్స్‌ప్రెస్‌ సంస్థ ఈ లాజిస్టిక్‌ పార్క్‌ని హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ జాతీయరహదారికి సమీపంలో నిర్మించింది. మూడేళ్ల ఈ పార్కు నిర్మాన పనులు ప్రారంభం కాగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 

సేఫెక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్‌ పార్క్‌లో 3 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఇక్కడ థర్డ్‌ పార్టీ లాజిస్టిక్‌ సేవలు లభిస్తాయి. ఏకకాలంలో 50 లారీల్లో లోడింగ్‌ ఆన్‌ లోడింగ్‌ చేసేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. ఫార్మా, ఎలక్ట్రిక్‌ రంగాల్లో హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కి ఈ లాజిస్టిక్‌ పార్కు ఉపయోగకరంగా మారనుంది. ఈ లాజిస్టిక్‌ పార్కు అందుబాటులోకి రావడం వల్ల మరింత వేగంగా సరుకు రవాణాకు అవకాశం ఏర్పడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement