ఉత్పత్తికి ఊతం
ఈ ఏడాదిలో తొమ్మిది కొత్త ప్రాజెక్టులు
లక్ష్యం 64.5 లక్షల టన్నుల ఉత్పత్తి
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నూతన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి నూతన గనుల ద్వారా సుమారు 64.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ విస్తరించి ఉన్న 11 ఏరియాల్లో 16 ఓపెన్‌కాస్టులు, 30 భూగర్భగనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. నూతన గనుల ఏర్పాటుతో 2016-17 వార్షిక ఉత్పత్తి లక్ష్యం 66 మిలియన్ టన్నులు చేరుకోవడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది.
బెల్లంపల్లి ఓసీ-2 గని గ్రౌండింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యూరుు. ఈనెలలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ గని ద్వారా ప్రతి ఏడాది 10 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయడమే లక్ష్యం. కాసిపేట-2 ఇన్‌క్లైన్ గని గ్రౌండింగ్ పను లు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్నాయి. ఏడాదికి 4.70 లక్షల టన్నుల ఉత్పత్తి తీయూలని అంచనా.కేఓసీ పిట్-1 గని గ్రౌండింగ్ పనులు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమై ఆగస్టు నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలు కానుంది. ఈ గని నుంచి ఏటా 30 లక్షల టన్నులు లక్ష్యం. ఈ ఏడాది మాత్రం 25 లక్షల టన్నులు తీయనున్నారు.
శాంతిఖనిలో కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ఈ ఏడాది జూన్ నెలలో ప్రవేశపెట్టి ఏటా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. జేవీఆర్ ఓసీ-2 గనిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రౌండింగ్ ప్రారంభించి అక్టోబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఏడాదికి 40 లక్షల టన్ను లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 15 లక్షల టన్నుల ఉత్పత్తి నిర్దేశించారు.మణుగూరు ఓపెన్‌కాస్టును నవంబర్‌లో ప్రారంభించి ఈ ఏడాది 5 లక్షల టన్ను లు బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 15 లక్షల టన్నులు లక్ష్యం. కేటీకే ఓసీ-2 గని గ్రౌండింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఏటా 12.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం. ఈ ఏడాది 2 లక్షల టన్నులు వెలికితీయనున్నారు.
పీవీకే కంటిన్యూయస్ మైనర్ యంత్రా న్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 2లక్షల టన్నులు ఉత్పత్తి చేయనున్నారు.కేకేకే ఓసీ ప్రాజెక్టును వచ్చే మార్చిలో ప్రారంభించి 3.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఈ కొత్త గనుల అసలు లక్ష్యం 138.2 లక్షల టన్నులు. నిర్దేశించిన సమయాల్లో ప్రారంభమైతే ఈ ఏడాది 64.5 లక్షల టన్నుల బొగ్గు అదనంగా కంపెనీకి సమకూరుతుంది. వచ్చే ఏడాది నుంచి 138.2 లక్షల టన్నులు వస్తుంది.