మరోసారి? | Prabhas and Rajamouli to turn producers | Sakshi
Sakshi News home page

మరోసారి?

Published Thu, Feb 6 2020 5:43 AM | Last Updated on Thu, Feb 6 2020 5:43 AM

Prabhas and Rajamouli to turn producers - Sakshi

ప్రభాస్‌

హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళిది బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌. వీళ్ల కలయికలో వచ్చిన ‘ఛత్రపతి’ పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌కి ప్యాన్‌ ఇండియా పాపులారిటీ తెచ్చిపెట్టింది. కలెక్షన్లు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి కొత్త మార్కెట్లు చూపెట్టింది. కాగా, మరోసారి ప్రభాస్‌– రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్‌. వారిద్దరూ కలసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనే ఉద్దేశంలో ఉన్నారని సమాచారం. ఆ నిర్మాణ సంస్థలో తొలి సినిమా వీళ్ల కాంబినేషన్‌లోనే చేయాలనుకుంటున్నార ట. ఈసారి పక్కా కమర్షియల్‌ సినిమా చేయాలనుకుంటున్నారనీ, 2021 చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్త ప్రచారంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement