
‘లక్ష్య’లో మాస్ లుక్; వరుడు కావలెను లో
శుక్రవారం (జనవరి 22) బర్త్‌డే సందర్భంగా నాగశౌర్య రెండు లుక్స్‌లో కనిపించారు. ఒకటి ఎయిట్ ప్యాక్ దేహంతో రఫ్‌గా, మరొకటి సంప్రదాయబద్ధమైన కుర్రాడి లుక్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘లక్ష్య’లో మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు శౌర్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు శౌర్య. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.
మరో సినిమా ‘వరుడు కావలెను’ విషయానికొస్తే.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా ఓ ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో నాగౌశర్య ముస్తాబవుతున్న సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది మేలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment