teasers released
-
‘ది కేరళ స్టోరీ’: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్‌గా ఎలా మారింది?
‘‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్‌కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ తన కథ చెప్పింది షాలినీ ఉన్నికృష్ణన్. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్‌లోని కథ ఇది. షాలినీ ఉన్నికృష్ణన్‌ని ‘ఫాతిమా’గా మార్చి, ఐఎస్ఐ తీవ్రవాదిగా ఎలా తయారుచేశారని కూడా ఈ టీజర్లో షాలినీ పేర్కొంది. ఈ పాత్రను అదా శర్మ చేస్తుండగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు.‘‘ఈ సినిమా కోసం సుదీప్తో నాలుగేళ్లు పరిశోధించారు. ఆయన చెప్పిన ఘటనలు విని, కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించేసుకున్నాను. వాస్తవ ఘటనలను చూపించనున్నాం’’ అన్నారు చిత్రనిర్మాత విపుల్ అమృత్లాల్ షా. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వెల్కమ్ టు అడల్ట్‌హుడ్.. 30 వెడ్స్ 21 సీజన్-2 టీజర్ రిలీజ్
30 Weds 21 Web Series Season 2 Teaser Released: 2021లో యూట్యూబ్‌లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అనే ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ సిరీస్. తొమిదేళ్ల ఏజ్ గ్యాప్‌తో పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూపించి ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో దంపతులుగా నటించిన చైతన్య, అనన్య జోడీ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఎంతో హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సిరీస్‌కు రెండో సీజన్ ఫస్ట్ లుక్‌ను ప్రకటించిన మేకర్స్ సోమవారం 30 వెడ్స్ 21 రెండో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇక మనిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అనేక భావోద్వేగాల మధ్య కలిసిన మేఘన, పృథ్వీలు జంటగా ప్రేమ పక్షుల్లా విహరించడం, అనుభూతి చెందడం టీజర్లో చూపించారు. 'నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది' అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు అసమర్థుడు, మనోజ్ పీ కథను అందించగా, పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. -
ఇదేందయ్యా ఇది.. సుడిగాలి సుధీర్‌ను ఇలా చూడలా !
Sudigali Sudheer Gaalodu Movie Teaser Released: జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కమెడియన్ సుడిగాలి సుధీర్. మెజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. దీంతో వచ్చిన గుర్తింపుతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు హీరోగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అవి అంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఓటమి నేర్పిన అనుభాలతో సుధీర్ మరింత ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు 'గాలోడు'గా వస్తున్నాడు సుడిగాలి సుధీర్. పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్ హీరోగా చేస్తున్న సినిమా గాలోడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'నన్ను నేను నమ్ముకుంటాను' అని చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు హీరోగా కూడా కామెడీ తరహా పాత్రలు చేసిన సుధీర్ ఈ సినిమాలో పూర్తి మాస్ హీరోగా కనిపించాడు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డిఫరెంట్ లుక్‌తో సుధీర్ బాగున్నాడు. ఇతర పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ కనిపించారు. త్వరలో సినిమా విడుదలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఒక్క రోజు షూటింగ్ ఖర్చు ఎంతో తెలుసా ? -
నితిన్ బర్త్‌డే: మాస్ట్రో టీజర్ వచ్చేసింది
యంగ్ హీరో నితిన్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మొదట అంధాదున్ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించి ఈ మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. అంతేగాక నితిన్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు సాయంత్ర మూవీ నుంచి మరో అప్డేట్ కూడా రానున్నట్లు మూవీ యూనిట్ చెప్పింది. చెప్పినట్లుగానే మేకర్స్ ‘మాస్ట్రో’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. టీజర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకంటోంది. ఈ మూవీలో నభా నటేష్ నితిన్‌తో జతకట్టనుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 11న ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
టీజర్: కథను కళ్లకు చూపిస్తే ‘నాట్యం’
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నాట్యం’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు, నాట్యం చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని చెబుతూ బుధవారం ఎన్టీఆర్ టీజర్‌ను లాంచ్ చేశారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాట్యం ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటోంది. ‘ఏం చేస్తున్నావ్ అని చిన్నారి అడగ్గా ఒక కథ తయారు చేస్తున్నా’ అని ఆదిత్య మీనన్ చెప్తాడు. ‘మనం కథను వింటాం కదా.. అదే కథను మన కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం’ అంటూ ఆదిత్యమీనన్ నాట్యం ప్రాధాన్యం ఆ చిన్నారికి వివరిస్తూ టీజర్ ఉంది. కూచిపూడి నృత్యం నేపథ్యంలో ‘కాదంబరి’ అనే పాత్ర చుట్టూ ఈ సినిమా ఉండనుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. సంధ్యా రాజ్, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలుగా నిశ్రుంకుల ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. రోహిత్ బెహల్, భానుప్రియ, శుభలేఖ సుధాకర్, జబర్దస్త్ దీవెన, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
‘తినేవాళ్లు జుట్టంతా.. పండించేవాళ్లు మీసమంతా’: శ్రీకారం టీజర్
‘ఓ హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్.. ఒక ఇంజినీర్ తన కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన హీరోగా, కిశోర్.బి దర్శకత్వం వహించిన చిత్రం శ్రీకారం. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీకారం బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ మహేశ్ టీజర్‌ను విడుదల చేశాడు. వాస్తవ ఘటనల నేపథ్యంతో సినిమా తీస్తున్నట్లు టీజర్లో ఉంది. వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా సినిమా నేపథ్యం ఉందని తెలుస్తోంది. ‘తినేవాళ్లు నెత్తిమీద జుట్టు అంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసం అంతమంది కూడా లేరు’ అంటూ రైతుల గురించి శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ హృదయాలను హత్తుకునే విధంగా ఉన్నాయి. కుటుంబ చిత్రంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘వస్తానంటివో పోతానంటివో భలేగుంది బాల’ పాటలు విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే సాయంత్రం 4.05 గంటలకు టీజర్ విడుదల చేస్తారని ప్రకటించగా.. దాదాపు ఓ గంట ఆలస్యంగా విడుదల చేశారు. -
నాగశౌర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
శుక్రవారం (జనవరి 22) బర్త్‌డే సందర్భంగా నాగశౌర్య రెండు లుక్స్‌లో కనిపించారు. ఒకటి ఎయిట్ ప్యాక్ దేహంతో రఫ్‌గా, మరొకటి సంప్రదాయబద్ధమైన కుర్రాడి లుక్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘లక్ష్య’లో మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు శౌర్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు శౌర్య. బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. మరో సినిమా ‘వరుడు కావలెను’ విషయానికొస్తే.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా ఓ ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో నాగౌశర్య ముస్తాబవుతున్న సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది మేలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ 2 టీజర్
బెంగళూరు: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే ఈ టీజర్ నెట్టింట్లో లీక్ అయి వైరల్‌గా మారింది. వాస్తవానికి యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.అయితే ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. మొదటి భాగానికి ఇది 2.0 వెర్షన్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. కాగా, కేజీఎఫ్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. జూలై 30నే కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Let's set foot into the empire 🔥#KGF2TeaserTomorrow at 10:18 AM on @hombalefilms. Premiering Now: https://t.co/Bmoh4Tz9Ry Set up your reminders now!@VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84 — Prashanth Neel (@prashanth_neel) January 7, 2021 -
'మర్డర్' సెకండ్ ట్రైలర్ విడుదల
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ నేతృత్వంలోని మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ ప్రధానపాత్రల్లో నటించిన మర్డర్ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్ ) మాస్టర్ మూవీ తెలుగు టీజర్ తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. లోకేష కనగరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తమిళ వెర్షన్లో విడుదలైన మాస్టర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే 'మాస్టర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు గాను భారీ మొత్తంలోనే నిర్మాతలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. (‘ఆదిపురుష్’ దర్శకుడు, విలన్‌పై కోర్టులో పిటిషన్ ) -
సూర్య టీజర్ కుమ్మేస్తోంది
-
సూర్య టీజర్ కుమ్మేస్తోంది
సాక్షి, సినిమా : తమిళ్‌తోపాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న నటుడు సూర్య. కొత్త చిత్రం తానా సెరంధా కూట్టమ్ టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. బాలీవుడ్ హిట్ మూవీ స్పెషల్ ఛబ్బీస్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కీర్తి సురేశ్ సూర్యకి జోడీగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే అక్కడ ఆదరణ లభిస్తుండగా.. మాస్ బీట్ తో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత కమెడియన్ సెంథిల్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో గ్యాంగ్ పేరుతో అనువాదం అవుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు విడుదల చేయబోతున్నారు. -
యూట్యూబ్‌లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం
ఒకవైపు అబ్బాయి.. మరోవైపు బాబాయి.. ఇలా ఇద్దరూ పోటీలు పడి టీజర్లు విడుదల చేసి అభిమానులను ముంచెత్తారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ నటించిన టెంపర్, లయన్ సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. వాటి విశేషాలు చూద్దాం.. ''ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం.. ఒక్కడు మీద పడితే అది దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర..'' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన టెంపర్ ఏ రేంజిలో ఉంటుందో ప్రేక్షకులకు ఓ శాంపిల్ చూపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమా టీజర్‌ను డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఇది సంచలనం సృష్టించడం మొదలుపెట్టేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఫేస్బుక్ పేజీలో కూడా టీజర్ షేర్ చేసుకున్నారు. ''కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే.. హిస్టరీలో వినబడుతుంది''... ఇదీ లయన్ సినిమా టీజర్లో నందమూరి బాలకృష్ణ డైలాగు. ఈ టీజర్‌ను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.15 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ టీజర్లో బాలయ్య మార్కు పంచ్ డైలాగులు కనిపించాయని అభిమానులు అంటున్నారు. టీజర్ పెట్టి ఇంకా ఒక్క రోజు కూడా కాకముందే లక్ష మందికి పైగా అభిమానులు దాన్ని యూట్యూబ్‌లో చూశారు.