
బెంగళూరు: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే ఈ టీజర్ నెట్టింట్లో లీక్ అయి వైరల్‌గా మారింది. వాస్తవానికి యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.అయితే ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. మొదటి భాగానికి ఇది 2.0 వెర్షన్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. కాగా, కేజీఎఫ్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. జూలై 30నే కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Let's set foot into the empire 🔥#KGF2TeaserTomorrow at 10:18 AM on @hombalefilms.
— Prashanth Neel (@prashanth_neel) January 7, 2021
Premiering Now: https://t.co/Bmoh4Tz9Ry
Set up your reminders now!@VKiragandur @TheNameIsYash @prashanth_neel @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @BasrurRavi @bhuvangowda84