యూట్యూబ్లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం | ntr and balakrishna release teasers simultaneously in youtube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం

Published Thu, Jan 1 2015 3:55 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

యూట్యూబ్లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం - Sakshi

యూట్యూబ్లో బాబాయ్.. అబ్బాయ్ యుద్ధం

ఒకవైపు అబ్బాయి.. మరోవైపు బాబాయి.. ఇలా ఇద్దరూ పోటీలు పడి టీజర్లు విడుదల చేసి అభిమానులను ముంచెత్తారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ నటించిన టెంపర్, లయన్ సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. వాటి విశేషాలు చూద్దాం..

''ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం.. ఒక్కడు మీద పడితే అది దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర..'' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన టెంపర్ ఏ రేంజిలో ఉంటుందో ప్రేక్షకులకు ఓ శాంపిల్ చూపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమా టీజర్ను డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదల చేశారు. యూట్యూబ్లో ఇది సంచలనం సృష్టించడం మొదలుపెట్టేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఫేస్బుక్  పేజీలో కూడా టీజర్ షేర్ చేసుకున్నారు.

''కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే.. హిస్టరీలో వినబడుతుంది''... ఇదీ లయన్ సినిమా టీజర్లో నందమూరి బాలకృష్ణ డైలాగు. ఈ టీజర్ను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.15 గంటలకు యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ టీజర్లో బాలయ్య మార్కు పంచ్ డైలాగులు కనిపించాయని అభిమానులు అంటున్నారు. టీజర్ పెట్టి ఇంకా ఒక్క రోజు కూడా కాకముందే లక్ష మందికి పైగా అభిమానులు దాన్ని యూట్యూబ్లో చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement