
Sudigali Sudheer Gaalodu Movie Teaser Released: జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కమెడియన్ సుడిగాలి సుధీర్. మెజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. దీంతో వచ్చిన గుర్తింపుతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు హీరోగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అవి అంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఓటమి నేర్పిన అనుభాలతో సుధీర్ మరింత ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు 'గాలోడు'గా వస్తున్నాడు సుడిగాలి సుధీర్.
పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్ హీరోగా చేస్తున్న సినిమా గాలోడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'నన్ను నేను నమ్ముకుంటాను' అని చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు హీరోగా కూడా కామెడీ తరహా పాత్రలు చేసిన సుధీర్ ఈ సినిమాలో పూర్తి మాస్ హీరోగా కనిపించాడు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డిఫరెంట్ లుక్‌తో సుధీర్ బాగున్నాడు. ఇతర పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ కనిపించారు. త్వరలో సినిమా విడుదలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్' ఒక్క రోజు షూటింగ్ ఖర్చు ఎంతో తెలుసా ?
Comments
Please login to add a commentAdd a comment