సాక్షి, సినిమా : తమిళ్‌తోపాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న నటుడు సూర్య. కొత్త చిత్రం తానా సెరంధా కూట్టమ్ టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. బాలీవుడ్ హిట్ మూవీ స్పెషల్ ఛబ్బీస్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది.
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కీర్తి సురేశ్ సూర్యకి జోడీగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే అక్కడ ఆదరణ లభిస్తుండగా.. మాస్ బీట్ తో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత కమెడియన్ సెంథిల్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో గ్యాంగ్ పేరుతో అనువాదం అవుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు విడుదల చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment