Thaana Serndha Koottam
-
అతని కోసం గుడికి..
నయనతార ఈ మధ్య ఓ గుడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారంటే ‘తానా సేంద కూట్టమ్’ హిట్టవ్వాలని. తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజైంది. సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయికగా నటించారు. మరి.. నయనతార ఎందుకు గుడికి వెళ్లారూ అంటే... విఘ్నేష్ శివన్ కోసమని చెన్నై టాక్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘తానా సేంద...’ సూపర్ హిట్. అంటే.. చిత్రబృందం కష్టానికి నయనతార పూజలు తోడయ్యాయా! -
ఆ ఇద్దరూ యువతరానికి మంచి ఉదాహరణ
‘‘నా స్కూల్, కాలేజ్ డేస్‌లో తమ్ముడు (కార్తీ), నేను బస్‌లోనే ప్రయాణం చేసేవాళ్లం. అమ్మానాన్న మమ్మల్ని సింపుల్‌గా పెంచారు. అందుకే మాకు విలువలు తెలుసు. ‘గ్యాంగ్’ చేస్తున్నప్పుడు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’’ అన్నారు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘తానా సేంద కూట్టమ్’. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ తెలుగులో ‘గ్యాంగ్’గా ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య విలేకరులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘గ్యాంగ్’ ఒప్పుకోవటానికి ప్రధాన కారణం దర్శకుడు విఘ్నేష్. అతను కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు లిరిసిస్ట్, డ్రమ్మర్. సీన్లు రాయటం, యాక్టర్స్ నుంచి ఫెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో కూడా అతని స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ డేస్‌లో చేశాను ఇలాంటి పాత్రలను. నా డైలాగ్ డెలివరీ దగ్గరి నుంచి నా క్యారెక్టర్ వరకు అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ► ఇది ‘స్పెషల్ 26’ సినిమాకు రీమేక్ అయినా కూడా విఘ్నేష్ శివన్ ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నిటికీ తనదైన టచ్ ఇచ్చారు. రెండు, మూడు సీక్వెన్స్‌లు కామన్‌గా ఉండొచ్చు. అంతే.. పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. ఈ సినిమాను ఓ కొత్త చిత్రంగా మలిచారు. అనిరు«ద్ మంచి మ్యూజిక్ అందించాడు. ► ‘మీరు రోడ్ సైడ్ టీ షాప్‌లో టీ తాగి ఎన్ని రోజులు అయింది?... ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్‌నే మీరు చేయబోతున్నారు’ అని చెప్పాడు విఘ్నేష్. ఈ సినిమా చేస్తున్నప్పుడు చదువు అయిపోయి నెక్స్›్ట ఏం ఉద్యోగం చేయాలి? అనే రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. నా ఫస్ట్ సాలరీ 726 రూపాయిలు. నా రూట్స్‌ని నేను ఎప్పుడూ మరచిపోలేదు. ► ఈ మధ్య వరుసగా దేశాలను, రాష్ట్రాలను కాపాడే పాత్రలను చేశాను, ఈ సినిమా కొంచెం రియలిస్టిక్ అప్రోచ్‌తో ఉంటుంది. ఈ సినిమా చాలా లైట్ హార్టెడ్‌గా ఉంటుంది. ఫుల్ టూ ఎంటర్టైన్మెంట్. ► ఫస్ట్ టైమ్ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. నేను చదువుకున్న తమిళ లిటరేచర్‌లో ‘సుందర తెలుంగు’ అన్నారు. ఇండియాలో స్వీటెస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని అర్థం. తమిళ డబ్బింగ్‌కు ఎనిమిది రోజులు తీసుకుంటే తెలుగు డబ్బింగ్ కేవలం ఆరు రోజుల్లో పూర్తి చేసేశాను. థాంక్స్ టు శశాంక్ వెన్నెలకంటి. ► ముందు టీజర్‌కు డబ్బింగ్ చెప్పాను. చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తో సినిమాకు డబ్బింగ్ చెప్పాను. ∙ప్రయోగాలు చేయటం ఎప్పుడూ ఆపను. అలాంటి కొత్త కాన్సెప్ట్‌లు రావాలంటే టైమ్ పడుతుంది. ఆ స్క్రిప్ట్‌లు అంత సులువుగా రావు. ఏదైనా ఎక్స్పె రిమెంట్ మూవీ చేశాక వెంటనే మంచి కమర్షియల్ చేయడం కరెక్ట్. ‘7 సెన్స్’ సినిమా అప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు. కానీ ‘సింగం’ విడుదలై మంచి విజయం సాధించింది. అప్పుడు ప్రొడ్యూసర్స్ దొరికారు. అలా కమర్షియల్ సినిమా చేస్తూ నా మార్కెట్ కాపాడుకుంటూనే ప్రయోగాలు చేయాలను కుంటున్నాను. ► సెల్వ రాఘవన్‌తో ఒక సినిమా స్టార్ట్ చేశాం. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్లు. ఆ తర్వాత కేవీ ఆనంద్‌తో ఒక సినిమా చేయాలి. ► నేను, కార్తీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం.. కుదర్లేదు. నేనో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకుంటు న్నాను కానీ ఎందుకో కుదరడం లేదు. త్వరలో నెరవేరుతుందను కుంటున్నాను. తమిళనాడు పాలిటిక్స్‌లో మంచి చేంజ్ రాబోతుంది అనుకుంటున్నాను. రజనీకాంత్, కమల్‌హాసన్ సార్లది డిఫరెంట్ ఐడియాలజీ. వాళ్ల ఒపీనియన్ వేరైనా మొన్న మలేసియాలో జరిగిన స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో అలా స్నేహంగా ఒకరి భుజం మీద ఒకళ్లు చేతులు వేసుకొని నిలబడి, మన యంగర్ జనరేషన్స్‌కు మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సినిమాలు హిట్ అవుతున్నాయి మనకి జనం ఓటు వేస్తారనుకుంటే పొరబాటే. అది వాళ్లకీ తెలుసు. మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు. మనల్ని మార్చగలిగేది ఎడ్యుకేషన్ అని నా నమ్మకం. అందుకే ‘అగరం ఫౌండేషన్’ స్థాపించాను. దీని ద్వారా 2000 మందిని విద్యావంతుల్ని చేస్తున్నాను. -
ఆంధ్రా మీల్స్ చాలా కారం కానీ..
‘‘సూర్యతో నాకు ‘గజిని’ సినిమా నుంచి అనుబంధం కొనసాగుతోంది. మా కాంబినేషన్లో సినిమా చేయాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాం కానీ కుదరడంలేదు. త్వరలో అవుతుందనుకుంటున్నాను. కీర్తీ సురేష్ నా స్నేహితుడి కూతురు. రమ్యకృష్ణ నా హీరోయిన్. నేను నిర్మించిన సినిమాల్లో యాక్ట్ చేశారు. తమిళంలో జ్ఞానవేల్ రాజాగారిది పెద్ద బ్యానర్. వంశీకు సినిమా అంటే పిచ్చి. సినిమా తీసి, అమ్ముకొని డబ్బులు చేసుకొని వెళ్లిపోయేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ నిలబడి తీసి, దమ్ముతో ఆడించే తక్కువమందిలో వంశీ ఒకడు. అందుకే తనంటే నాకు ఇష్టం. సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య, కీర్తీ సురేష్ జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘తానా సేంద కూట్టమ్’ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ చేస్తున్నారు. అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. సూర్య మాట్లాడుతూ– ‘‘మన స్కూల్లో, కాలేజ్‌లో, ఆఫీస్‌లో ఇలా ప్రతి చోటా మనకు ఒక గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్ మన లైఫ్‌లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ మా గ్యాంగ్‌లో మెంబర్స్ అయ్యారు. అల్లు అరవింద్‌గారు ‘గజిని’ సినిమా నుంచి మా గ్యాంగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తమిళ ఫ్లేవర్ కనిపిస్తే క్షమించండి. కుటుంబం అంతా చూసే చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘ఆంధ్రా మీల్స్ చాలా కారం, కానీ.. సినిమాపై మీ (ప్రేక్షకులు) ప్రేమ అపారం. అందరూ గ్యాంగ్‌గా వచ్చి ఈ సినిమాను చూడండి’’ అన్నారు దర్శకుడు. ఈ వేడుకలో దర్శకుడు మారుతి, నటి రమ్యకృష్ణ, కథానాయిక కీర్తీ సురేష్ పాల్గొన్నారు. -
చాలెంజ్ గెలిచా
‘‘చిన్నప్పుడు మా అమ్మతో ఓ చాలెంజ్ చేశాను. అది ఇప్పటికి గెలిచాను’’ అంటున్నారు కీర్తీ సురేష్. నటి మేనక కుమార్తె కీర్తీ సురేష్ అని తెలిసిన విషయమే. ఇంతకీ చిన్నప్పుడు వాళ్ల అమ్మతో కీర్తి ఏమని చాలెంజ్ చేసి ఉంటారు? అంటే.. ‘‘నేను చిన్నప్పుడు సూర్యగారికి పెద్ద అభిమానిని. మా అమ్మగారు అప్పటికే సూర్య వాళ్ల నాన్న శివకుమార్‌తో మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఏదో ఒక రోజు వాళ్ల అబ్బాయి సూర్యతో కలిసి నటిస్తాను అని మా అమ్మగారితో చాలెంజ్ చేశాను. అన్నట్టుగానే ఇప్పుడు చాలెంజ్ గెలిచాను. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘తానా సేంద కూట్టమ్’ (తెలుగులో ‘గ్యాంగ్’) చిత్రంలో సూర్య సరసన తొలిసారి యాక్ట్ చేశాను. ఈ సినిమాలో సంప్రదాయమైన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్. తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తోన్న కీర్తి విజయ్‌తో ‘భైరవ’ సినిమా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. -
పొంగల్‌కి వరోమ్
... అంటే పొంగలి తింటారా? అని అడుగుతున్నామేమో అనుకుంటున్నారా? నో చాన్స్. వరోమ్ అంటే వస్తాం అని అర్థం. సంక్రాంతిని తమిళంలో పొంగల్ అంటారు. వచ్చే సంక్రాంతికి సూర్య ఇటు తెలుగు అటు తమిళ సినిమాల రిలీజ్ రేస్‌లో ఉన్నారు. ఆయన హీరోగా ‘తానా సేంద కూట్టమ్’ అనే చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ‘గ్యాంగ్’ ఫస్ట్ లుక్‌తోపాటు సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ‘‘షూటింగ్ కంప్లీట్ అయింది. సూర్య సార్, విఘ్నేష్ శివన్.. మొత్తం యూనిట్‌ని మిస్ అవుతున్నా. పొంగల్‌కి వరోమ్’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘సూర్య చిత్రాన్ని మా బ్యానర్లో రిలీజ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అనిరు«ద్ మంచి సంగీతం అందిచారు. కీర్తీ సురేశ్ నటన హైలైట్. కార్తీక్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించారు’’ అన్నారు వంశీ, ప్రమోద్. -
సూర్య టీజర్ కుమ్మేస్తోంది
-
సూర్య టీజర్ కుమ్మేస్తోంది
సాక్షి, సినిమా : తమిళ్‌తోపాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న నటుడు సూర్య. కొత్త చిత్రం తానా సెరంధా కూట్టమ్ టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. బాలీవుడ్ హిట్ మూవీ స్పెషల్ ఛబ్బీస్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కీర్తి సురేశ్ సూర్యకి జోడీగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, సీనియర్ నటుడు కార్తీక్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే అక్కడ ఆదరణ లభిస్తుండగా.. మాస్ బీట్ తో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత కమెడియన్ సెంథిల్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో గ్యాంగ్ పేరుతో అనువాదం అవుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు విడుదల చేయబోతున్నారు. -
సంక్రాంతి సందడిలో...
టాలీవుడ్, కోలీవుడ్... ఇలా భాష ఏదైనా సంక్రాంతికి సినిమాల సందడి జోరుగా ఉంటుంది. ఎన్ని సినిమాలు విడుదలైనా పండక్కి బోలెడన్ని టిక్కెట్లు తెగాల్సిందే... సినిమాలకు కలెక్షన్ల పంట పండాల్సిందే. వచ్చే సంక్రాంతి బరిలో ‘నేనుంటా’ అంటున్నారు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘థానా సేంద కూట్టమ్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది కోలీవుడ్ ఖబర్. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సొడక్కు...’ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్లో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలనుకుంటు న్నారటని కోలీవుడ్ టాక్. హిందీ హిట్ ‘స్పెషల్ ఛబ్బీస్’ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. -
శివగామికి మరో పవర్ఫుల్ రోల్!
రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘థానా సెరంధ కూటం’లో రమ్యకృష్ణకు మరో విశిష్టమైన కీలక పాత్ర దక్కింది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్ అయ్యాయి. దీనిని బట్టి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ ఇప్పటికే చేరినట్టు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిసురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు గతంలో కథనాలు రాగా, వాటిని చిత్రయూనిట్ కొట్టిపారేసింది. వేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సూర్య ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘సింగం-3’ రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.