
టాలీవుడ్, కోలీవుడ్... ఇలా భాష ఏదైనా సంక్రాంతికి సినిమాల సందడి జోరుగా ఉంటుంది. ఎన్ని సినిమాలు విడుదలైనా పండక్కి బోలెడన్ని టిక్కెట్లు తెగాల్సిందే... సినిమాలకు కలెక్షన్ల పంట పండాల్సిందే. వచ్చే సంక్రాంతి బరిలో ‘నేనుంటా’ అంటున్నారు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘థానా సేంద కూట్టమ్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక.
ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది కోలీవుడ్ ఖబర్. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సొడక్కు...’ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలనుకుంటు న్నారటని కోలీవుడ్ టాక్. హిందీ హిట్ ‘స్పెషల్ ఛబ్బీస్’ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment