ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు! | Naga Shourya says It will never be the same | Sakshi
Sakshi News home page

ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు!

Published Sun, Jul 26 2020 7:13 AM | Last Updated on Sun, Jul 26 2020 7:13 AM

Naga Shourya says It will never be the same - Sakshi

నాగశౌర్య

నాగశౌర్య అనగానే లవర్‌ బాయ్‌ గుర్తొస్తాడు. పక్కింటి కుర్రాడిలా సాఫ్ట్‌గా కనిపిస్తూ కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ యువహీరో ‘ఆశ్వథ్థామ’ చిత్రంతో రూట్‌ మార్చి మాస్‌ ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఇప్పుడు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో నాగశౌర్య మరింత మాస్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ లుక్‌ని ‘ది గేమ్‌ విల్‌ నెవర్‌ బీ ది సేమ్‌’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో విడుదల చేసింది చిత్రబృందం.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో వెనకనుండి కనిపిస్తున్న నాగశౌర్య ప్రీ లుక్‌కి విశేష స్పందన లభించిందని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రం కోసం జుట్టు, గెడ్డం కూడా బాగా పెంచినట్టు ప్రీ లుక్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఈ నెల 27న  ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను  డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల విడుదల చేయనున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement