గురి తప్పకుండా... | Naga Shourya Lakshya shooting almost completed | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 11 2021 12:48 AM | Last Updated on Sun, Jul 11 2021 4:16 AM

Naga Shourya Lakshya shooting almost completed - Sakshi

విల్లు ఎక్కుపెట్టారు నాగశౌర్య. గురి తప్పకుండా బాణం వదిలారు. మరి.. దేనికి గురిపెట్టారనేది ‘లక్ష్య’ సినిమాలో తెలుస్తుంది. నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. కేతికా శర్మ హీరోయిన్‌ . ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య. అలాగే విలువిద్య నేర్చుకుని, ఈ సినిమా చేస్తున్నారు.  సోనాలి నారంగ్‌ సమర్పణలో నారయణదాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమ్యాక్స్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగశౌర్యతో పాటు జగపతిబాబు తదితరులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement