ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే బాటలో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు, ఓ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారు. వారాహి చలనచిత్ర బ్యానర్ నిర్మిస్తున్న 'జ్యో అచ్యుతానంద' సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్.
సాయి కొర్రపాటి నిర్మాణంలో నారా రోహిత్ హీరోగా 'జ్యో అచ్యుతానంద' సినిమాను ప్రారంభించారు. అయితే సినిమా మొదలైనప్పుడు,జ్యోతి, అచ్యుతరావు, ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల మధ్య కథ అని చెప్పాడు దర్శకుడు. దీంతో మరో హీరో కోసం అప్పటినుంచే వేట ప్రారంభించారు. ఫైనల్గా వారాహి బ్యానర్లో హీరోగా సక్సెస్ అయిన నాగశౌర్యను ఈ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారు.
ప్రస్తుతం సావిత్రి, రాజా చెయ్యివేస్తే సినిమాల్లో నటిస్తున్న రోహిత్ ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే జ్యో అచ్యుతానంద టీంతో జాయిన్ అవుతాడు. నాగశైర్య కూడా మెగా వారసురాలు నిహారిక వెండితెరకు పరిచయం అవుతున్న ఒక్క మనసు సినిమాలో నటిస్తున్నాడు. దీంతో జ్యో అచ్చుతానంద సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర నటీనటులు సాంకేతిక వర్గ ఎంపిక కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.
నారా రోహిత్ సినిమాలో యువహీరో
Published Sat, Nov 21 2015 3:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
Advertisement
Advertisement