
నాగశౌర్య, షామిలి, సుమిత్ర
‘‘అమ్మమ్మగారి ఇల్లు అంటే జ్ఞాపకాల పొదరిల్లు. ఆప్యాయతల అల్లర్లు, సంతోషాల మధురిమలు. అవన్నీ దండిగా మా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో ఉన్నాయి’’ అంటున్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగశౌర్య, బేబి షామిలి జంటగా శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య దర్శకత్వంలో కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటించా. కథను నమ్మి సినిమా చేశాం.
ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో మరింత దగ్గరవుతాను. దర్శకుడు సూర్య బాగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. నాగశౌర్య నటన హైలైట్’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతో మరో సినిమా చేయలేదు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు షామిలి. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ రమణ.
Comments
Please login to add a commentAdd a comment