baby shalini
-
నా పన్నెండేళ్ల కల తీరింది
‘‘అమ్మమ్మగారిల్లు’ సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. సినిమాలో ‘లాక్ యువర్ ఏజ్’ అనే కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. నా లాక్ ఏజ్ ఏంటంటే.. 2008 నుంచి 2018 వరకూ. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు రావు రమేశ్. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుందర్ సూర్య మాట్లాడుతూ– ‘‘ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేయడం వండర్ఫుల్ మూమెంట్. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. కానీ, నా పన్నెండేళ్ల కలని ‘అమ్మమ్మగారిల్లు’ తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్’’ అన్నారు. ‘‘మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగ ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వేడుకలో నటీనటులు సుధ, హేమ, మధుమణి, రూపాలక్ష్మి, శక్తి, చందు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మ గుర్తుకు రావడం ఖాయం
‘‘సుందర్‌గారు ‘అమ్మమ్మగారిల్లు’ వంటి మంచి కథ చెప్పడమే కాదు.. చెప్పినట్లు తీశారు కూడా. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సుమిత్రగారు అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. రసూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ‘ఒకరికి ఒకరు’ లాంటి సినిమా చేయాలని ఉంది. బేబి షామిలీ చిన్నప్పుడు చేసిన సినిమాలు చూశాను. ఇప్పుడు హీరోయిన్గా తను ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని చాలామంది నటీనటులు అనుభవం ఉన్నవారే. నాకు చక్కటి సహకారం అందించారు. షామిలీగారికి స్టోరీ చెప్పగానే నచ్చడంతో ఆలోచించకుండా చేస్తానన్నారు. నాగశౌర్యగారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘నాగశౌర్య, షామిలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేశాం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘మా అమ్మమ్మగారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావరణాన్ని ఈ సినిమా షూటింగ్ సమయంలో చూశాను’’ అన్నారు బేబి షామిలీ. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కెమెరామెన్ రసూల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటీనటులు మధుమణి, హేమ, గౌతంరాజు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది
‘‘కొన్ని రోజుల క్రితం ‘అమ్మమ్మగారిల్లు’ యాడ్ చూడగానే నా బాల్యంలోని మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. మేమంతా వేసవి సెలవులకు వెళ్లినప్పుడు అక్కడ ఆడుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజంతా నేను చాలా మంచి ఫీలింగ్‌లో ఉండిపోయాను. అలాంటి ఫీలింగ్ ఇచ్చినందుకు యూనిట్‌కి థ్యాంక్స్. ‘అమ్మమ్మగారిల్లు’ మంచి హిట్‌తో పాటు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అమ్మమ్మగారిల్లు’ ఒక గుడిలాంటిది. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు ఎదురైనా తగాదాలు పడం. అలాగే అమ్మమ్మగారి ఇంటికెళ్లినప్పుడు కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలున్నా అమ్మమ్మ బాధపడకూడదని బయటికి నవ్వుతూ ఉంటాం. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. దయచేసి ఎవరూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలతో ఈ సినిమా చేశా. నాగశౌర్య లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాత్ర కన్నీరు పెట్టిస్తుంది. మా నిర్మాతలు చక్రపాణి–నాగిరెడ్డిగార్లలా కలిసి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత రాజేష్. సహ నిర్మాత కుమార్, ఛాయాగ్రాహకుడు రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మమ్మగారింటికి వేసవిలోనే...
నాగశౌర్య, బేబి షామిలి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్లో రాజేష్, కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవలే సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. తాజాగా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నెల 22న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న. -
ఇంటికి మంచి ఆఫర్స్
హీరో నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ 2.75 కోట్లకు అమ్ముడైంది. ఒక్క నిమిషం ఏవేవో ఊహించుకుని కంగారు పడకండి. ‘అమ్మమ్మగారిల్లు’ అనేది సినిమా టైటిల్ అండి బాబు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. టీజర్ రెడీ అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను పైన చెప్పిన మొత్తానికి ఓ ప్రముఖ టీవీ చానల్ దక్కించుకుంది. ‘‘చక్కని కుటుంబ కథాచిత్రమిది. అచ్చ తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఓవర్సీస్, హిందీ రైట్స్‌కు సంబంధించి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాగశౌర్య కెరీర్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ మూవీగా నిలుస్తుంది. దర్శకుడు బాగా తీశారు. వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
అమ్మమ్మగారింట్లో...
‘‘అమ్మమ్మగారి ఇల్లు అంటే జ్ఞాపకాల పొదరిల్లు. ఆప్యాయతల అల్లర్లు, సంతోషాల మధురిమలు. అవన్నీ దండిగా మా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో ఉన్నాయి’’ అంటున్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగశౌర్య, బేబి షామిలి జంటగా శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య దర్శకత్వంలో కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటించా. కథను నమ్మి సినిమా చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో మరింత దగ్గరవుతాను. దర్శకుడు సూర్య బాగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. నాగశౌర్య నటన హైలైట్’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతో మరో సినిమా చేయలేదు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు షామిలి. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ రమణ. -
అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు
* భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం * మూడేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడమే కారణం * నడుముకు తీవ్ర గాయాలు.. విజయవాడ తరలింపు * జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టలో ఘటన ఏలూరు (వన్‌టౌన్) : పేదరికంలో మగ్గిపోతున్న తమ కుటుంబాన్ని బాగా చదివి ఆదుకోవాలనుకున్న ఆ యువతి ఆశయాలను కామాంధుడైన అధ్యాపకుడు కాల రాశాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువతి చివరకు నడుం విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలైంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టకు చెందిన నాగేశ్వరరావు, నాగమణి కుమార్తె బాదిన బేబీషాలిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరింది. అదే కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురానికి చెందిన ఎన్.కిషోర్ బేబిషాలినితో ప్రేమలో పడ్డారు. మూడేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇంటర్ అనంతరం షాలినిని డిగ్రీ చేయనివ్వకుండా టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరాలని పట్టుబట్టాడు. బిఫార్మసీ ఫ్రీసీటు వచ్చినా వద్దని వారించాడు. ఈ క్రమంలో షాలినీ, ఆమె కుటుంబ సభ్యులు అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే తనకు రూ.ఐదు లక్షలు కట్నం కావాలని కిషోర్ తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి గురువారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు యువతి నడుం విరిగిందని మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు. దీంతో శుక్రవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి నేతల అండదండలు గురువారం రాత్రి పదిగంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. రాత్రి ఆస్పత్రిలో బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన జంగారెడ్డిగూడెం పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. నిందితుడు కిషోర్‌కు కొందరు అధికార పార్టీ నేతలు అండగా నిలిచి కేసు లేకుండా చేసేందుకు విఫలయత్నం చేసినట్టు తెలిసింది. విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు హడావుడిగా ఏలూరు చేరుకుని అప్పటికప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అతనితోనే పెళ్లి చేయాలి ‘కిషోర్‌ను ఏమీ చేయవద్దని, అతనితో తనకు పెళ్లి చేయాలి’ అని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలినీ శుక్రవారం విలేకరుల వద్ద వాపోయింది. యువతి తల్లిదండ్రులు కూడా తాము పేదోళ్ళం బాబు మా కూతురికి అతనితో పెళ్లి జరిగితే చాలయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షాలినీకి ఇంకా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు తరలించారు.