
బేబి షామిలి, నాగశౌర్య
హీరో నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ 2.75 కోట్లకు అమ్ముడైంది. ఒక్క నిమిషం ఏవేవో ఊహించుకుని కంగారు పడకండి. ‘అమ్మమ్మగారిల్లు’ అనేది సినిమా టైటిల్ అండి బాబు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. టీజర్ రెడీ అవుతోంది.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను పైన చెప్పిన మొత్తానికి ఓ ప్రముఖ టీవీ చానల్ దక్కించుకుంది. ‘‘చక్కని కుటుంబ కథాచిత్రమిది. అచ్చ తెలుగు టైటిల్ పెట్టడంతో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఓవర్సీస్, హిందీ రైట్స్‌కు సంబంధించి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాగశౌర్య కెరీర్‌లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ మూవీగా నిలుస్తుంది. దర్శకుడు బాగా తీశారు. వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment