శివాజీ రాజా, సుందర్ సూర్య, రావు రమేష్, కేఆర్
‘‘అమ్మమ్మగారిల్లు’ సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. సినిమాలో ‘లాక్ యువర్ ఏజ్’ అనే కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. నా లాక్ ఏజ్ ఏంటంటే.. 2008 నుంచి 2018 వరకూ. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు రావు రమేశ్. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుందర్ సూర్య మాట్లాడుతూ– ‘‘ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేయడం వండర్‌ఫుల్ మూమెంట్.
నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. కానీ, నా పన్నెండేళ్ల కలని ‘అమ్మమ్మగారిల్లు’ తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్’’ అన్నారు. ‘‘మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగ ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వేడుకలో నటీనటులు సుధ, హేమ, మధుమణి, రూపాలక్ష్మి, శక్తి, చందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment