Ammammagarillu
-
నా పన్నెండేళ్ల కల తీరింది
‘‘అమ్మమ్మగారిల్లు’ సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. సినిమాలో ‘లాక్ యువర్ ఏజ్’ అనే కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. నా లాక్ ఏజ్ ఏంటంటే.. 2008 నుంచి 2018 వరకూ. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు రావు రమేశ్. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుందర్ సూర్య మాట్లాడుతూ– ‘‘ఇంత మంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్లనే నేను డైరెక్ట్ చేయడం వండర్ఫుల్ మూమెంట్. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. కానీ, నా పన్నెండేళ్ల కలని ‘అమ్మమ్మగారిల్లు’ తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లాక్ ఏజ్’’ అన్నారు. ‘‘మా సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం నా టీమ్’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల ముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగ ఈ మధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వేడుకలో నటీనటులు సుధ, హేమ, మధుమణి, రూపాలక్ష్మి, శక్తి, చందు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టంతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మమ్మగారిల్లు
‘‘చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసినవాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువ ఉంటుంది. నా జీవితంలోని తీపి జ్ఙాపకాలు, నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను సినిమాలో భాగం చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఎంతో ఇష్టపడి చేశా’’ అన్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగ శౌర్య, షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించారు. కె.ఆర్ సహనిర్మాత. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సూర్య మీడియాతో మాట్లాడుతూ –‘‘నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. రెండేళ్ల క్రితం కె.ఆర్,రాజేష్‌లు పరిచయమయ్యారు. ఇందులో నాగ శౌర్య బావుంటాడని నిర్మాతలే సలహా ఇచ్చారు. ► బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడ లేదు. అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేశారు. ► షాలిని పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెను హీరోయిన్గా తీసుకున్నాను. శౌర్య, షామిలి ఇద్దరూ బాగా నటించారు. రావురమేష్, ‘షకలక’ శంకర్, మిగతా నటీనటులంతా బాగా చేశారు. కళ్యాణ రమణ, రసూల్, సాయి కార్తీక్ మంచి సహకారం అందిచారు. ► లవ్‌స్టోరీ, ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ లైన్స్ ఉన్నాయి. నెక్ట్స్ సినిమా గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు. -
అమ్మమ్మ గుర్తుకు రావడం ఖాయం
‘‘సుందర్‌గారు ‘అమ్మమ్మగారిల్లు’ వంటి మంచి కథ చెప్పడమే కాదు.. చెప్పినట్లు తీశారు కూడా. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, బేబి షామిలీ జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సుమిత్రగారు అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. రసూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ‘ఒకరికి ఒకరు’ లాంటి సినిమా చేయాలని ఉంది. బేబి షామిలీ చిన్నప్పుడు చేసిన సినిమాలు చూశాను. ఇప్పుడు హీరోయిన్గా తను ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని చాలామంది నటీనటులు అనుభవం ఉన్నవారే. నాకు చక్కటి సహకారం అందించారు. షామిలీగారికి స్టోరీ చెప్పగానే నచ్చడంతో ఆలోచించకుండా చేస్తానన్నారు. నాగశౌర్యగారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘నాగశౌర్య, షామిలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేశాం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత కె.ఆర్. ‘‘మా అమ్మమ్మగారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావరణాన్ని ఈ సినిమా షూటింగ్ సమయంలో చూశాను’’ అన్నారు బేబి షామిలీ. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కెమెరామెన్ రసూల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటీనటులు మధుమణి, హేమ, గౌతంరాజు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మమ్మగారిల్లు’ ప్రి రిలీజ్ వేడుక