సుందర్ సూర్య
‘‘చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసినవాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువ ఉంటుంది. నా జీవితంలోని తీపి జ్ఙాపకాలు, నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను సినిమాలో భాగం చేశాను. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఎంతో ఇష్టపడి చేశా’’ అన్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగ శౌర్య, షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’.
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించారు. కె.ఆర్ సహనిర్మాత. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సూర్య మీడియాతో మాట్లాడుతూ –‘‘నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. రెండేళ్ల క్రితం కె.ఆర్,రాజేష్‌లు పరిచయమయ్యారు. ఇందులో నాగ శౌర్య బావుంటాడని నిర్మాతలే సలహా ఇచ్చారు.
► బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడ లేదు. అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేశారు.
► షాలిని పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాను. శౌర్య, షామిలి ఇద్దరూ బాగా నటించారు. రావురమేష్, ‘షకలక’ శంకర్, మిగతా నటీనటులంతా బాగా చేశారు. కళ్యాణ రమణ, రసూల్, సాయి కార్తీక్ మంచి సహకారం అందిచారు.
► లవ్‌స్టోరీ, ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ లైన్స్ ఉన్నాయి. నెక్ట్స్ సినిమా గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment