Ammamma Garillu Censor Report | ‘అమ్మమ్మ గారిల్లు’ సెన్సార్‌ పూర్తి - Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 8:42 AM | Last Updated on Tue, May 22 2018 11:32 AM

Naga Shourya Ammamma Garillu Gets U Certificate - Sakshi

ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో .. ఈ యువహీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓయ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షామిలి మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవలే విడుదల చేసిన అమ్మమ్మ గారిల్లు టీజర్‌, పోస్టర్స్‌, లిరికల్‌ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు  క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది . స్వాజిత్‌ బ్యానర్‌పై రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 25న విడుదలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement