‘అమ్మమ్మ గారిల్లు’ ట్రైలర్‌ విడుదల | Naga Shourya Ammamma Garillu Trailer Released | Sakshi
Sakshi News home page

Published Thu, May 24 2018 8:50 AM | Last Updated on Thu, May 24 2018 11:43 AM

Naga Shourya Ammamma Garillu Trailer Released - Sakshi

కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణే గతేడాది వచ్చిన శతమానం భవతి. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న అమ్మమ్మ గారిల్లు కూడా కుటుంబం, ఎమోషన్స్‌ లాంటి ఫార్మాట్‌లోనే ఉండబోతోంది. ఈ సినిమా టీజర్‌, సాంగ్స్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

తాజాగా విడుదలైన అమ్మమ్మగారిల్లు సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఈ  సినిమా కథను ఎవరైనా ఊహించవచ్చు. అయితే అందరికీ తెలిసిన కథే అయినా... తీసే విధానం, స్ర్కీన్‌ ప్రజెంటేషన్‌తో సినిమాను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లవచ్చు. ఈ ట్రైలర్‌లో.. జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి... తెలిసిరావాలంటే కొడుకును కనాలి అంటూ రావు రమేశ్‌ చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాను స్వాజిత్‌ బ్యానర్‌పై రాజేశ్‌ నిర్మించగా... సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమా రేపు (మే 25) విడుదల కాబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement