సాక్షి, హైదరాబాద్ : నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు వారాల్లో సుమారు రూ.23.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్, రీమేక్ హక్కులతో మరో ఆరు కోట్లవరకూ బిజినెస్ చేసి 2018లో బ్లాక్‌బస్టర్‌గా నిలించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి సినిమాకు పనిచేసిన 24 రంగాలకు చెందిన వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ప్రారంభం రోజునే అనుకున్నామని, హిట్ అవగానే సినిమాకు కష్టపడి పని చేసిన వారిని సత్కరించాలని అనుకున్నామని తెలిపారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తాము ఇచ్చే చిరుకానుక అని అన్నారు. ఐరా బ్యానర్ ప్రారంభించడానికి కారణమైన వెంకీ కుడుములకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుములకు నిర్మాతలు కారు బహుమతిగా ఇచ్చారు.
దర్శకుడు వెంకీ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సినిమా నిర్మించిన నిర్మాతల రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇవ్వడం గిఫ్ట్ అయితే, హిట్ అవడం డబుల్ గిఫ్ట్ అని, ఇక నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా భావిస్తున్నానని తెలిపారు. నాగ శౌర్యలేకపోతే తాను లేనని, తన హీరోను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment