మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది.
రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్‌లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.
Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7
— Business Today (@business_today) June 20, 2024
VIDEO CREDITS: Business Today
గతేడాది సెప్టెంబర్‌లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్‌లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్‌కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.
Caption this...pic.twitter.com/ilIUhnxxw1
— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024
ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్‌కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment