
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా సక్సెస్ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు.
(ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!)
చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్‌ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది.
ఉదయ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్‌కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్ సార్‌కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సెల్వరాజ్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! )
ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமாக விவாதிக்கிறார்கள். தங்களுடைய எண்ணங்களை கதையுடனும் களத்துடனும் தொடர்புபடுத்தி கருத்துகளை பகிர்கிறார்கள். உலகத் தமிழர்களிடையே விவாதத்துக்குரிய கருப்பொருளாக மாறியிருக்கிறது. அம்பேத்கர், பெரியார், அண்ணா, கலைஞர் போன்ற நம் தலைவர்கள் ஊட்டிய சுயமரியாதை உணர்வை,… pic.twitter.com/ro4j7epjAI
— Udhay (@Udhaystalin) July 2, 2023
Comments
Please login to add a commentAdd a comment