
బర్త్‌డే బేబి కల్యాణితో శర్వానంద్, సుధీర్, నాగవంశీ, రవీందర్
హలో ఎక్కడున్నావ్ హలో.. అంటున్నారు కల్యాణి ప్రియదర్శన్ అభిమానులు. అఖిల్ సరసన ‘హలో’లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడేం చేస్తున్నారంటే శర్వానంద్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గురువారం కల్యాణి బర్త్‌డే. ఈ పుట్టినరోజుకి మీరు అందుకున్న బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అని కల్యాణిని అడిగితే – ‘‘ఇంతకంటే బెస్ట్ బర్త్‌డే ఉండదేమో. అలా ఎందుకన్నానంటే ఈరోజే నా కొత్త సినిమా లొకేషన్లోకి ఎంటరయ్యాను.
నాకు గ్యాంగ్‌స్టర్ మూవీస్ అంటే ఇష్టం. శర్వానంద్‌తో చేస్తున్న ఈ సినిమా ఆ బ్యాక్‌డ్రాప్‌లోనిదే కావడం హ్యాపీ. బర్త్‌డే రోజున ప్రొఫెషనల్‌గా బిజీగా ఉండటంకన్నా బెస్ట్ గిఫ్ట్ ఇంకేముంటుంది? వైజాగ్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. మంచి టీమ్‌తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. సినిమాల ఎంపిక విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నానని, మంచి కథ, పాత్ర అయితేనే ఒప్పుకుంటున్నానని, కొంచెం లేట్ అయినా ఫర్వాలేదు, హడావిడి పడదల్చుకోలేదని కల్యాణి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment