
నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం పునః ప్రారంభమైంది. ప్రస్తుతం వరి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌తో నాని, మరికొంతమంది నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘జగదీశ్ జాయిన్స్, టక్ బిగిన్స్’ అని షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన సందర్భంగా నాని పేర్కొన్నారు. జగపతిబాబు, రావు రమేశ్, సీనియర్ నరేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.
Comments
Please login to add a commentAdd a comment