'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్: విశాల్ | Vishal Speech At 'Mark Antony' Movie Poster Launch Event - Sakshi
Sakshi News home page

Vishal Mark Antony Movie: 'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్

Aug 29 2023 3:42 AM | Updated on Aug 29 2023 9:33 AM

Vishal Speech at Mark Antony Movie - Sakshi

‘‘ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు.. వారి ఆదరాభిమానాలతోనే నేనీ స్థాయికి వచ్చాను’’ అని హీరో విశాల్‌ అన్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది.

కాగా నేడు విశాల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ‘మార్క్‌ ఆంటోని’ వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలు చేశా. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement