'హ్యాపీ బర్త్ డే టు మి' | Shruthi Haasan birthday celebrations | Sakshi
Sakshi News home page

'హ్యాపీ బర్త్ డే టు మి'

Published Thu, Jan 28 2016 11:20 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

'హ్యాపీ బర్త్ డే టు మి' - Sakshi

'హ్యాపీ బర్త్ డే టు మి'

స్టార్ వారసురాలిగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్లో సక్సెస్ కోసం చాలాకాలమే ఎదురుచూసింది. 2009లో తెరకెక్కిన లక్ సినిమాతో వెండితెర మీద మెరిసిన ఈ భామ హిట్ కోసం 2012 వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్సింగ్ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్న శృతి, ఆ తరువాత వరుస సక్సెస్లతో నెంబర్ హీరోయిన్గా ఎదిగింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తున్న శృతిహాసన్ గురువారం పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తనకు తానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్ డే టు మీ' అంటూ ట్వీట్ చేసింది. ఎలాంటి ఈగోలు లేకుండా తన తోటి హీరోయిన్స్తో ఎంతో స్నేహంగా ఉండే శృతిహాసన్కు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, త్రిష లాంటి హీరోయిన్స్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో విశాల్, దేవీ శ్రీ ప్రసాద్ లతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు శృతి హాసన్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement