పాన్‌ ఇండియా స్థాయిలో విశాల్‌ కొత్త సినిమా | Vishal,A Vinoth Kumar,Rana Productions Pan India Film Launched | Sakshi
Sakshi News home page

మంచి మార్పుకోసం.. విశాల్‌ కొత్త సినిమా

Published Thu, Sep 2 2021 10:32 AM | Last Updated on Thu, Sep 2 2021 10:32 AM

Vishal,A Vinoth Kumar,Rana Productions Pan India Film Launched - Sakshi

విశాల్‌ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఎ. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునైన హీరోయిన్‌. రానా ప్రొడక్షన్స్‌ పతాకంపై రమణ, నంద నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ‘‘సమాజంలో ఓ మంచి మార్పు తీసుకురావడానికి కారణం అయ్యే ఓ అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్‌ ఉంటుంది. విశాల్‌ ఇప్పటివరకు చాలా యాక్షన్‌ సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో నెక్ట్స్‌ లెవల్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను చూస్తారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో దాదాపు 45 నిమిషాల యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయి. దిలీప్‌ సుబ్బరాయన్‌ స్టంట్స్‌ సమకూర్చుతున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాలగోపి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement