'ఎనిమి' కాంబినేషన్‌లో విశాల్‌ కొత్త మూవీ | Vishal 33: Adhik Ravichandran, Actor Vishal Reunited For Pan Indian Movie | Sakshi
Sakshi News home page

Vishal 33: విశాల్‌ పాన్‌ ఇండియా చిత్రం ఖరారు

Published Thu, Dec 16 2021 8:06 PM | Last Updated on Thu, Dec 16 2021 8:06 PM

Vishal 33: Adhik Ravichandran, Actor Vishal Reunited For Pan Indian Movie - Sakshi

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమి సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధించింది.  ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది. విశాల్ హీరోగా ఎస్ వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్లు గురువారం ప్రకటించారు. విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్టుకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement