పుస్తకంలో పట్టేంత రొమాన్స్‌! | Vikram and Rithu Varma are playing the pairs of 'Dhruva nakshathram'. | Sakshi

పుస్తకంలో పట్టేంత రొమాన్స్‌!

Jul 18 2017 1:18 AM | Updated on Sep 5 2017 4:15 PM

పుస్తకంలో పట్టేంత రొమాన్స్‌!

పుస్తకంలో పట్టేంత రొమాన్స్‌!

‘‘ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది. అతి తక్కువ రోజుల్లో ధృవ, నేను ఎలా ప్రేమలో పడ్డాం? మా మధ్య ఏం జరిగింది? అనేది వర్ణించడానికి ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది’’ అంటున్నారు అనుపమ.

‘‘ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది. అతి తక్కువ రోజుల్లో ధృవ, నేను ఎలా ప్రేమలో పడ్డాం? మా మధ్య ఏం జరిగింది? అనేది వర్ణించడానికి ఓ పుస్తకం రాస్తే బాగుంటుంది’’ అంటున్నారు అనుపమ. ఎవరీ అనుపమ? అంటే... తెలుగమ్మాయి రీతూ వర్మే. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘ధృవ నక్షత్రం’.

ఇందులో మాంచి స్టైలిష్‌ యాక్షన్‌ ఉంటుందనేది ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు తన మార్క్‌ రొమాన్స్‌ కూడా ఉంటుందని గౌతమ్‌ మీనన్‌ చెబుతున్నారు. ఇటీవల యూరప్‌ దేశాల్లో పూర్తయిన షెడ్యూల్‌లో విక్రమ్, రీతూ వర్మలపై రొమాంటిక్‌ సీన్స్‌ తీశారు. మరో 30 రోజులు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుందని దర్శకుడు ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement