అనుకోని కారణాల వల్ల సినిమా తీయడం అప్పుడప్పుడు లేట్ అవుతుంటుంది. ఏడాది అనుకున్నది రెండేళ్లు పట్టొచ్చు. కానీ విడుదల అయితే చేస్తారు. ఓ స్టార్ హీరో నటించిన మూవీ మాత్రం ఏకంగా పదేళ్ల నుంచి వెయిటింగ్‌లో ఉండిపోయింది. దానికి ఇన్నాళ్లకు మోక్షం దక్కింది. ట్రైలర్ రిలీజ్ చేయగా అది వావ్ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు)
పైన అంతా చెప్పింది తమిళ హీరో విక్రమ్ 'ధృవ నచ్చిత్రం' సినిమా గురించే. దీనికి గౌతమ్ మేనన్ దర్శకుడు. 2013లో సూర్యతో చేద్దామని అనుకున్నాడు. ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది. 2016లో విక్రమ్ హీరోగా మొదలైంది. కానీ బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల అప్పటి నుంచి సెట్స్ మీదే ఉండిపోయింది. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ నవంబరు 24న థియేటర్లలోకి రానుంది.
తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్పై అండర్ కవర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు క్లారిటీ వచ్చింది. లవ్, యాక్షన్, థ్రిల్.. ఇలా చాలా ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి. మరి ఇన్నేళ్ల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ కూడా బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబరు 24 వరకు వెయిట్ చేయాల్సిందే.
(ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!)
Comments
Please login to add a commentAdd a comment