Tamil Actor Vishal Averts Major Mishap on ‘Mark Antony’ Sets - Sakshi
Sakshi News home page

Vishal: పది నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు: విశాల్

Published Fri, Aug 11 2023 7:39 PM | Last Updated on Fri, Aug 11 2023 8:30 PM

Kollywood Star Hero Interesting Comments On Mark Antony Shooting - Sakshi

తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్‌ ఆంటోని. ఈ చిత్రానికి ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మ కనిపించనుంది. ఎస్‌జే సూర్య ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రం.. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు వెల్లడించారు. 

(ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై బుల్లితెర నటి! )

విశాల్ మాట్లాడుతూ..'మార్క్‌ ఆంటోని షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరిగింది. ఓ ఫైట్‌ సీన్‌ చేసి విశ్రాంతి తీసుకుంటున్నా. అదే సమయంలో ఓ పెద్ద ట్రక్కు  నా వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో దాన్ని నేను చూశా. అందువల్లే తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా. నా అదృష్టం కొద్ది అది సెట్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో చావును దగ్గరి నుంచి చూశా. ఆ సంఘటనతో షాక్‌కు గురయ్యా. నిజంగా నాకు ఆరోజు పునర్జన్మే. పది నిమిషాలు ఒంటరిగా ఉ‍న్నా. చాలా సేపు ఏం తోచని స్థితిలో ఉండిపోయా.' అంటూ విశాల్‌ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా తన కోస్టార్ ఎస్‌జే సూర్య పై విశాల్‌ ప్రశంసలు కురిపించారు. అతన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడని తెలిపారు. ప్రేక్షకులంతా హీరో కోసం వెయిట్ చేస్తే.. తాను మాత్రం సూర్య కోసం వెతికేవాన్ని అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

(ఇది చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement