
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. ఈ సినిమాకు తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు హక్కులను దక్కించుకున్న కె.ఎఫ్.సి ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ అనే పాటను విడుదల చేశారు. సమ్రాట్ చారి, పూర్ణాచారి సాహిత్యం అందించారు. ‘‘మొబైల్ అప్లికేషన్ డెవలెప్పర్ సిద్ధార్థ్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డ సిద్దార్థ్, అతని స్నేహితుడు కల్లీస్ ఏం చేశారు? వారు చేసిన పనుల వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అన్నదే కథ’’ అన్నారు దేసింగ్ పెరియసామి.
Comments
Please login to add a commentAdd a comment