మూడు భాషల్లో బిజీ | Kannum Kannum Kollaiyadithaal is Dulquer Salmaan's 25th film | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో బిజీ

Feb 4 2018 1:22 AM | Updated on Feb 4 2018 1:22 AM

Kannum Kannum Kollaiyadithaal is Dulquer Salmaan's 25th film - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌

మాలీవుడ్‌ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం ఫుల్‌ బిజీ. ఒక్క భాషలో కాదు. ఏకంగా మూడు భాషల్లో. మాలీవుడ్‌–టాలీవుడ్‌–బాలీవుడ్‌ ఇలా మూడు భాషల చిత్రాల్లో షూటింగ్‌ చేస్తూ ఫుల్‌ బిజీ అయ్యారీ మలయాళ హీరో. తెలుగులో సావిత్రి బయోపిక్‌ మూవీ ‘మహానటి’లో జెమినీ గణేశన్‌ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌తో కలిసి ‘కర్వాన్‌’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. డబ్బింగ్‌ మూవీ ‘ఓకే బంగారం’ ద్వారా ఆల్రెడీ దుల్కర్‌ తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘కర్వాన్‌’తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

ఇక, దుల్కర్‌ చేస్తున్న తాజా మలయాళ చిత్రం ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌’ విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారట. ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూ వర్మ ఇందులో హీరోయిన్‌. దేసింగ్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. వేలంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది దుల్కర్‌కి 25వ సినిమా కావడం విశేషం. హీరో అయిన ఐదేళ్లల్లో దుల్కర్‌ 25 సినిమాల మైలురాయి చేరుకోవడం గొప్ప విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement