శర్వా ఎక్స్‌ప్రెస్‌ | Sharwanand, Ritu Varma new film launched | Sakshi

శర్వా ఎక్స్‌ప్రెస్‌

Aug 29 2019 12:21 AM | Updated on Aug 29 2019 4:49 AM

Sharwanand, Ritu Varma new film launched - Sakshi

శర్వానంద్‌, రీతూ వర్మ

ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలను ట్రాక్‌ ఎక్కిస్తున్నారు శర్వానంద్‌. ఆల్రెడీ రెండు సినిమాలు (96 రీమేక్, శ్రీకారం) లైన్‌లో ఉండగానే మూడో సినిమాకు ముహూర్తం జరిపించారు. శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తిక్‌ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై యస్‌.ఆర్‌. ప్రభు, యస్‌.ఆర్‌ ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్నారు.

రీతూ వర్మ కథానాయిక. ఈ చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభం అయింది. షూటింగ్‌ కూడా స్టార్ట్‌ అయింది. ‘‘విడదీయలేని స్నేహం, ప్రేమ’ అనే అంశాలతో ఈ కథ ఉంటుంది. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ రాస్తున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంగీతం: జాక్స్‌ బీజోయ్, కెమెరా: సుజిత్‌ సారంగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement