అదిరిపోయిన శర్వానంద్‌ ‘సంక్రాంతి సందళ్లే’ పాట | Sharwanand Sreekaram Movie Second Song Released | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన శర్వానంద్‌ ‘సంక్రాంతి సందళ్లే’ పాట

Published Thu, Jan 7 2021 8:21 PM | Last Updated on Thu, Jan 7 2021 8:55 PM

Sharwanand Sreekaram Movie Second Song Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్నతాజా చిత్రం ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ ఫోక్‌ సాంగ్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. త్వరలోనే సంక్రాంతి పండుగ వస్తుతన్న సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం చిత్ర యూనిట్‌ ఈ పాటను గురువారం విడుదల చేసింది. ‘సందల్లే.. సందల్లే సంక్రాంతి సందల్లే’ అంటూ ఈ సాగే ఈ పాటకు సానపాటి భరద్వాజ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కుల‌క‌ర్ణి - మోహ‌న భోగ‌రాజు ఆలపించారు. 

సంక్రాంతి పండుగ సందర్బంగా రంగురంగులా ముగ్గులు, గొబ్బెమ్మలు పెడుతూ ఉర్లోని యువతులంతా సందడి చేస్తుండగా హీరో శర్వానంద్‌ ‘సంద‌ళ్లే సంద‌ళ్లే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా అంటూ చిందులేస్తున్నాడు. సంక్రాంతి వైభోగ‌మంతా ఈ పాట‌లో కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌ల చేసిన ‘బ‌లేగుంది బాలా’కు అపూర్వమైన స్పంద‌న ల‌భించింది. పెంచ‌ల్ దాస్ రచించి, పాడిన ఆ పాట‌ విడుదలైన కొద్ది గంటలకే లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

14 రీల్స్‌ ప్లస్‌బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందించగా జే యువరాజ్‌ సినిమాటో గ్రఫి అందించారు. ఈ సినిమాలో రావు ర‌మేష్‌, ఆమ‌ని, సీనియ‌ర్ న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement