మహేశ్‌–శర్వా–ఓ సినిమా | Sharwanand to star in Mahesh Babu's upcoming production | Sakshi
Sakshi News home page

మహేశ్‌–శర్వా–ఓ సినిమా

Published Fri, Jun 26 2020 6:10 AM | Last Updated on Fri, Jun 26 2020 6:10 AM

Sharwanand to star in Mahesh Babu's upcoming production - Sakshi

మహేశ్‌బాబు, శర్వానంద్‌

మహేశ్‌బాబు–శర్వానంద్‌... ఈ కాంబినేషన్‌ చాలా కొత్తగా ఉంటుంది. వీరిద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరి కాంబినేషన్‌ అనగానే హీరోలుగా అనుకుంటారేమో! కానీ కాదు. శర్వానంద్‌ హీరోగా మహేశ్‌బాబు ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మహేశ్‌బాబు సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మహేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రాలకు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అడివి శేష్‌ హీరోగా ‘మేజర్‌’ అనే సినిమాను నిర్మిస్తున్నారు మహేశ్‌. ఇటీవల ఆయన ఓ కథ విన్నారట. ఆ కథకు శర్వానంద్‌ అయితే సరిపోతాడన్నది మహేశ్‌ ఆలోచన అని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement