Rashmika Mandanna Releases Cheppake Cheppake Lyrical Song From Maha Samudram - Sakshi
Sakshi News home page

'మహాసముద్రం' నుంచి మరో లిరికల్‌ సాంగ్‌

Published Mon, Sep 6 2021 12:49 PM | Last Updated on Mon, Sep 6 2021 1:12 PM

Rashmika Mandanna Launches Cheppake Cheppake Song From Maha Samudram - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ''హే రంభ'' పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ విడుదల అయ్యింది. "చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. అంటూ సాగే ఈ సాంగ్‌ను హీరోయిన్‌ రష్మిక విడుదల చేసింది.

చైతన్ భరద్వాజ్ సంగీతంలో వచ్చిన ఈ మెలోడి సాంగ్‌ ఆకట్టుకుంటుంది. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.చాలాకాలం తరువాత సిద్ధార్థ్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: టెన్నిస్‌ స్టార్‌తో రిలేషన్‌.. కన్‌ఫర్మ్‌ చేసిన ‘ఖడ్గం’ భామ!
ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్‌ సేతుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement