Sharwanand Maha Samudram Movie Trailer Released Date Announced - Sakshi
Sakshi News home page

‘మహాసముద్రం’ ట్రైలర్ రీలీజ్‌ ఎ​ప్పుడంటే..?

Published Tue, Sep 21 2021 8:04 AM | Last Updated on Tue, Sep 21 2021 9:48 AM

Maha Samudram Movie Trailer Release Date Announced - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్‌ సాంగ్స్‌ రిలీజ్‌ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ నెల 23న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

మొదటి సినిమాతోనే మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు అజయ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా.. జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా దసరా కానుకగా అక్టోబర్ 14న సినిమా విడుదల కానుంది.

చదవండి: 'మహాసముద్రం' నుంచి మరో లిరికల్‌ సాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement