‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. చాలా గ్యాప్ తర్వాత ‘మహా సముద్రం’ చిత్రంతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.
చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి
దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ కాస్తా నిరాశ పరిచిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లీక్స్‌లో మహా సముంద్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రావు రమేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment