
శర్వానంద్
శర్వానంద్‌తో తొలిసారి ‘పడి పడి లేచె మనసు’ వంటి ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి రెండో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం శర్వానంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని కొత్త సినిమాని ప్రకటించారు సుధాకర్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించనున్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఇది ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.