Amma Song Lyric Video From Kanam Movie Out Now | Sid Sriram Kanam Movie Amma Song - Sakshi
Sakshi News home page

Kanam: అమ్మపాట త‌మిళ వ‌ర్ష‌న్ విన్నారా?

Published Fri, Jan 28 2022 8:41 AM | Last Updated on Fri, Jan 28 2022 8:49 AM

Amma Song Lyric Video From Kanam Movie Out Now - Sakshi

కణం చిత్రంలో అమ్మపాట కీలకంగా ఉంటుందని దర్శకుడు శ్రీకార్తీక్‌ పేర్కొన్నారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఇది. సీనియర్‌ నటి అమల చాలాకాలం తరువాత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, రీతువర్మ.. హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్, జెకే ఎనుమ్‌ నన్భనిన్‌ వాళ్కై చిత్రాల తరువాత శర్వానంద్‌ తమిళ ప్రేక్షకులకు ముందుకు రానున్న చిత్రం ఇది.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ఒకే ఒక జీవితం అనే టైటిల్‌ నిర్ణయించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ప్రతి చిత్రంలోనూ కథను ప్రతిబింబించే ఒక పాట ఉంటుందన్నారు. అలా ఈ చిత్రంలో అమ్మ పాట కథకు ఆత్మగా ఉంటుందని చెప్పారు. తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటల్లో ఇది ఒకటి అన్నారు. దీని అర్థం మారకుండా తమిళంలో ఉమాదేవి రాయగా జేక్స్‌ బిజాయ్‌ సంగీత దర్శకత్వంలో సిద్‌ శ్రీరామ్‌ పాడారని తెలిపారు. ఈ పాట విన్న వారికి తమ తల్లి జ్ఞాపకాలు కళ్లముందు నిలుస్తాయన్నారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే అందరినీ ఆకట్టుకుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement