'పెళ్లిచూపులు' మూవీ రివ్యూ
టైటిల్ : పెళ్లిచూపులు
జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్
తారాగణం : విజయ్ దేవరకొండ, రీతూ వర్మ
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని
మాస్ కమర్షియల్ మూస సినిమాల నుంచి బయటికి వస్తున్న సగటు ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనానికి మంచి విజయాలను అందిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా టేకింగ్తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో ఆడియన్స్ ముందుకు వచ్చిన అందమైన ప్రేమ కథ 'పెళ్లిచూపులు'. మరి ఈ పెళ్లి చూపులు తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాయి.
కథ :
జీవితం మీద పెద్దగా క్లారిటీ లేనట్టుగా కనిపించే, ఈ తరం యువకుడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఓ మంచి చెఫ్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. దీంతో ప్రశాంత్కు భవిష్యత్తు మీద ఆలోచన లేదన్న భావనతో పెళ్లి చేస్తే కుదురుకుంటాడని చిత్ర( రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయిస్తారు పెద్దలు. కానీ చిత్రకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఎలాగైన ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది చిత్ర కల.
చిత్ర పెళ్లికి నో చెప్పటంతో ప్రశాంత్కు వేరే అమ్మాయిని చూస్తారు. కానీ ఆ సంబంధం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవ్వటంతో ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రశాంత్, చిత్రతో కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలు పెడతాడు. ఏ మాత్రం పొంతన లేని వేరు వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది..? చివరకు ప్రశాంత్, చిత్రలు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఎవడే సుబ్రమణ్యంతో సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విజయ్ మ్యాన్లీ లుక్ సినిమాకు ప్లస్ అయ్యింది. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా రీతూ నటన బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ను అద్భుతంగా పలికించింది. సినిమా అంతా హీరో హీరోయిన్లు చుట్టూ నడిచే కథ కావటంతో ఇతర పాత్ర దారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అయితే ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
తొలి సినిమాతోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా రెండు విభాగాలలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగాన్ని ఎంతో పక్కాగా నడిపించిన తరుణ్ ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. రొమాంటిక్ కామెడీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ను అందిస్తూనే ఎక్కడగా గీత దాటకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాకు మరో మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫి, నగేష్ బెగెల్లా అందించిన సినిమాటోగ్రఫి.. ఎక్కడా ఇది చిన్న సినిమా అన్న ఆలోచన రాకుండా చేసింది. పరిమిత బడ్జెట్లో కూడా అద్భుతమైన క్వాలిటీ అందించాడు నగేష్. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
తరుణ్ భాస్కర్ దర్శకత్వం
విజయ్, రీతూల నటన
మైనస్ పాయింట్స్ :
ప్రిడిక్టబుల్ స్టోరి
సెకండ్ హాఫ్ స్లో నారేషన్
ఓవరాల్గా పెళ్లిచూపులు, ఈ తరం యువత మనోభావాలను తెలిపే సరికొత్త ప్రేమకథ