
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్‌కి ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తనకు ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చానన్నాడు.
చదవండి: సింగర్ కేకే మృతికి చిరంజీవి, మహేశ్ బాబు నివాళి
‘మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లో లేరు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. ఏవో కథలు రాసుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో జేబులో పది రూపాయలు ఉండేవి కాదు. అయినా బుర్రలో 100 కోట్ల ఆలోచనలు ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్లే వాడిని. అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. అంతా కలిసి ఒక బ్యాచ్‌గా ఉంటూ సినిమాల గురించిన ఆలోచనలు చేస్తుండేవాళ్లం. అలా చివరికి ‘పెళ్లి చూపులు’ సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇటు నాకు .. అటు విజయ్‌కి ఇద్దరి కెరియర్‌కు ఆ సినిమా చాలా హెల్ప్ అయింది’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment