అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..
దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్‌లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..
రిచ్ లుక్ చీర..
దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్‌గా ఉంటారు.
అనార్కలి గౌను
గ్రాండ్‌గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్‌లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .
లెహంగాస్
లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్‌తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్‌తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండి
చీరకట్టు స్టైల్ డిజైర్‌వేర్..
గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్‌లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్‌లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్‌లతో జత చేయండి.
సల్వార్ సూట్
పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్‌లో వివిధ రకాల సల్వార్‌లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్‌తో కూడిన సల్వార్ సూట్‌లు వేడుకలను మరింత కలర్‌ఫుల్ మయం చేస్తాయి.
(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!)
Comments
Please login to add a commentAdd a comment