చిన్నప్పుడు చిన్న చిన్న గౌనులు వేసుకున్న ముచ్చట మదిలో అలాగే నిలిచిపోయి ఉందా! ఇప్పుడు అలాంటి చిన్న గౌన్ వేసుకోలేం అని బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్‌లో ఉంది. ఫ్రాక్ కి..ర్రాక్ పుట్టిస్తోంది. ఈ ఫ్రాక్ స్టైల్ పాశ్చాత్య, సంప్రదాయ డ్రెస్సులతో అతివలను అమితంగా ఆకట్టుకుంటుంది.
∙వేసవి కాలం చెమట, ఉక్కపోతలు సహజం. ధరించే డ్రెస్ ఎలాంటిదైనా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, అదే సమయంలో స్టైలిష్‌గా తోడయితే ఎంత బాగుండు అనుకునేవారికి కాటన్ ఫ్రాక్ సరైన ఎంపిక. కాటన్ బాటమ్, ఇక్కత్ లేదా ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఎంచుకుంటే చాలు. సమ్మర్‌లో క్యాజువల్ లుక్‌లోనూ స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు.
∙కాలర్ నెక్ ప్యాటర్న్‌తో ఉన్న ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్‌కి ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రధాన ఆకర్షణ. లాంగ్ జార్జెట్ స్లీవ్స్ బాటమ్‌గా పూర్తి కాంట్రాస్ట్ ధోతీ ప్యాంట్ ధరిస్తే పార్టీకి సిద్ధమే!
∙నైట్ వెడ్డింగ్ పార్టీ. లైట్ల ధగ ధగలతో డ్రెస్ కూడా పోటీపడాలంటే జరీ జిలుగులతో తీర్చిదిద్ది షార్ట్ ఫ్రాక్ ధరించాల్సిందే!
∙ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ఎంచుకునేటప్పుడు మరొక చిన్న మెలకువ తెలుసుకోవాలి. ఫ్రాక్ అంచుగా జరీ బార్డర్, ఫ్రంట్ బటన్స్ అయితే లుక్ మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది.
∙మెహెందీ కలర్ షార్ట్ ఫ్రాక్ సూట్ మీదకు హెవీ వర్క్‌తో డిజైన్ చేసి దుపట్టా ధరిస్తే సెలబ్రిటీలకు తీసిపోని విధంగా ఎలాంటి వేదికైనా వైబ్రెంట్‌గా వెలిగిపోవాల్సిందే!
∙లెహెంగా మీదకు డిజైనర్ బ్లౌజ్ ధరించడం మామూలే! అదే ప్లెయిన్ లెహెంగా మీదకు బెనారస్ షార్ట్ ఫ్రాక్ ధరిస్తే వేడుకలో ప్రత్యేకంగా నిలవచ్చు.
∙ధోతీ ప్యాంట్ మీదకు చిన్న గౌన్ ధరించి, డిజైనర్ దుపట్టా వేసుకొని, సన్నని డిజైనర్ బెల్ట్ నడుమున చుడితే పెళ్లికి ప్రత్యేక కళ వచ్చేస్తుంది.
– నిర్వహణ: ఎన్.ఆర్
ఫ్రాక్ కి..ర్రాక్!
Published Fri, Apr 6 2018 12:18 AM | Last Updated on Fri, Apr 6 2018 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment