బై బై బాయ్స్! | new fashion to womens | Sakshi
Sakshi News home page

బై బై బాయ్స్!

Jul 28 2016 10:42 PM | Updated on Sep 4 2017 6:46 AM

బై బై బాయ్స్!

బై బై బాయ్స్!

అవకాశాల్లో... ఆసక్తిలో... ఎనర్జీలో... ఎచీవ్‌మెంట్‌లో.. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనప్పుడు వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో ...

అవకాశాల్లో... ఆసక్తిలో... ఎనర్జీలో... ఎచీవ్‌మెంట్‌లో..  అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనప్పుడు వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో మాత్రం  తేడా ఎందుకు?!  డైనమిక్‌గా.. స్మార్ట్‌గా..  ముచ్చటగా అనిపిస్తున్నారు.  ఒకప్పుడు బాయ్స్ జోన్ అయిన  ఈ డ్రెస్సులు ఇప్పుడు అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు.  బై బై.. బాయ్స్...!!

 

క్యూట్ గర్ల్స్‌కి డిజైనర్ సూచనలు..
మగవారి వేషధారణలో తప్పనిసరి అయిన దుస్తులు ఇప్పుడు మగువల వార్డ్రోబ్‌లో ముందస్తుగా చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కూల్ క్రిస్ప్ షర్ట్స్, టైలర్డ్ బ్లేజర్స్, డెనిమ్స్, సిగరెట్ ప్యాంట్స్.. వంటి మెన్స్‌వేర్ ముందువరసలో ఉంటున్నాయి.


మగవారి వస్త్రధారణలో ఎంత బాగున్నా స్త్రీ సహజత్వ మెరుగులు కనిపించేలా తయారైతేనే మరింత స్టైలిష్‌గానూ అందంగానూ కనిపిస్తారు. మగవారి డ్రెస్సింగ్ కదా! అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే స్ట్రీట్ స్టైల్ ట్రెండ్ జాబితాలో చేరిపోయింది.   మీ హృదయానికి నచ్చిన డ్రెస్సింగే కాలానికి తగ్గట్టుగా ఉంటే అదే అతి పెద్ద ట్రెండ్‌గా మెరుస్తుంది.  ఈ తరహా వస్త్రధారణలో ఉన్నప్పుడు సింపుల్‌గా అనిపించాలి. ఆభరణాలు, మేకప్ నప్పవు. క్యాజువల్ వేర్ కదా అని మరీ ఒంటికి అతుక్కుపోయేలాంటి దుస్తులు ధరించకూడదు. ఎబ్బెట్టుగా కనిపిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement